అరవింద సమేత తరువాత ఎన్టీఆర్ ,త్రివిక్రమ్ కాంబోలో ఇంకో సినిమా రానుంది.అయితే ఈసారి మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయనున్నారు.నిజానికి ఈసినిమా అల్లు అర్జున్ తో చేద్దాం అనుకున్నాడు త్రివిక్రమ్.కానీ అల్లు అర్జున్ అట్లీ సినిమాతో బిజీ కావడంతో ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది.ఎన్టీఆర్ కూడా ఈసినిమా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించనుంది.త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.అయితే అంతకుముందే ఆల్రెడీ నిర్మాత నాగవంశీ ఈసినిమా గురించి హింట్ ఇచ్చేశాడు.ఇక ఈన్యూస్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవర్ ఫుల్ గాడ్ సుబ్రహ్మణ్య స్వామి /కుమార స్వామి స్టోరీతో ఈసినిమా తీయనున్నాడు త్రివిక్రమ్.ఇందులో సుబ్రహ్మణ్య స్వామి గా ఎన్టీఆర్ కనిపించనున్నాడు. దాంతో అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి సుబ్రమణ్య స్వామి కథ పెద్దగా ఎవరికి తెలియదు.ఇప్పుడు ఈకథ ను చెప్పనున్నాడు త్రివిక్రమ్. ఇంతకుముందెన్నడు లేని విధంగా ఈసినిమా రూపొందనుంది.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు.ఈఏడాది కల్లా షూటింగ్ కంప్లీట్ కానుంది.ఆతరువాత తమిళ డైరెక్టర్ నెల్సన్ తో ఓ సినిమా కమిట్ అయ్యాడు.అలాగే కొరటాల శివతో దేవర 2కూడా చేయాల్సివుంది.ఇక ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాకూడా వుంది.మరి ఈమూడు సినిమాల్లో ఏది ముందు సెట్స్ మీదకు వెళ్తుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























