పవన్ కళ్యాణ్ గారు మీతో ఇంకో సినిమా చేయాలన్నారు – జ్యోతి కృష్ణ 

pawan said to me we will do one more film says jyothi krishna

పవర్  స్టార్  పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు జూన్ 12 న విడుదలకావల్సి ఉండగా వాయిదాపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో వుంది.ఇక ఈసినిమాపై అంచనాలు మరింత పెంచాడు డైరెక్టర్ జ్యోతి కృష్ణ.నిన్న ఓ ఈవెంట్ లో జ్యోతి కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హరిహర వీర మల్లు ను  పవన్ కళ్యాణ్ గారు మూడు సార్లు చూశారు.ఆయన చాలా సంతృప్తి వ్యక్తం చేశారు.ఒక గంట సేపు మెచ్చుకున్నారు నన్ను. అంతేకాదు మీతో మళ్ళీ ఓ సినిమా చేయాలనీ కూడా అన్నారు.అలాగే 250కోట్ల బడ్జెట్ తో  చేసిన సినిమా ఇది. సినిమాలో బందర్ పోర్ట్ గురించి స్పెషల్ సీక్వెన్స్ ఉంది.గ్రాఫిక్స్ లో రీ క్రియేట్ చేయడానికి  2 సంవత్సరాలు  కష్టపడ్డాం.ఆ సీక్వెన్స్  కోసం పవన్ కళ్యాణ్  గారు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు.అవుట్ ఫుట్ ని స్క్రీన్ లో చూస్తే మచిలీపట్నం కాదు ఇండియాలో ఉన్న అందరు దద్దరిల్లిపోతారంటూ చెప్పొకొచ్చాడు.జ్యోతి కృష్ణ స్పీచ్ తో పవన్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను క్రిష్ ,జ్యోతి కృష్ణ డైరెక్ట్  చేయగా నిధి అగర్వాల్ ,నోరా ఫతేహి, బాబీ డియోల్  కీలక పాత్రల్లో నటించారు.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత ఏఏం రత్నం ఈసినిమాను నిర్మిస్తున్నారు.త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా రిలీజ్ డేట్ ను చెప్పనున్నారు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.