మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం తన 75వ సినిమా ‘మాస్ జాతర’లో నటిస్తున్నాడు. దీని షూటింగ్ చివరిదశలో ఉంది. డెబ్యూ డైరెక్టర్ భాను భోగవరపు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు 27న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే, తాజాగా రవితేజ తన నెక్స్ట్ ఫిల్మ్ అప్పుడే మొదలెట్టేశాడు. ‘#RT 76’ గా వ్యవహరిస్తున్న ఈ మూవీకి ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్షన్ చేస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ ఇందులో రవితేజ ఎంత స్టైలిష్‌గా ఉండనున్నాడో తెలియజేస్తుంది.
ఈ అనౌన్స్మెంట్ పోస్టర్లో రవితేజ వెరీ స్టైలిష్ అవతార్‌లో, డిజైనర్ సూట్ ధరించి కనిపిస్తున్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ సీటులో హాయిగా కూర్చున్న అతను, ముందు సీటుపై ఒక కాలు క్యాజువల్‌గా ఆనించి, ఒక చేతిలో వైన్ బాటిల్, మరో చేతిలో పుస్తకంతో కనిపించడం అదిరిపోయింది. ఇది ఇప్పటివరకు రవితేజ మోస్ట్ స్టైలిష్ లుక్‌ను సూచిస్తుంది. అతను పట్టుకున్న పుస్తకంలో ‘సీ ఇట్ & సే ఇట్’ అని స్పానిష్‌లో ఉంది, ఇది అతని పాత్రపై ఆసక్తిని పెంచుతోంది.
కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టుమేకర్స్ ప్రకటించారు. అలాగే ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు నటించనున్నట్టు తెలుస్తోంది. వీరిలో ఒకరు ఆషికా రంగనాథ్, ఇంకొకరు దింపుల్ హయాతి అని తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. ఇక ఈ సినిమాలో నటించనున్న నటీనటులు మరియు పనిచేయనున్న సాంకేతిక నిపుణుల వారివరకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
ఇక ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. బ్లాక్‌బస్టర్ ధమాకా కోసం చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించిన తర్వాత భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి రవితేజతో మళ్ళీ వర్క్ చేస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల డీవోపీగా పని చేస్తుండగా.. అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, AS ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వహిస్తున్నారు. కాగా RT76 రెగ్యులర్ షూటింగ్ జూన్ 16 నుండి హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























