తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం జూన్ 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ హిస్టారికాల్ యాక్షన్ డ్రామాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాబీ డియోల్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు మరోసారి వాయిదా పడనుందని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. యూనిట్ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం, హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరక్కుతున్న ఈ సినిమాకు భారీగా వీఎఫ్ఎక్స్ వర్క్ అవసరం అవుతోంది. అయితే ఇది అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో తప్పనిసరై సినిమా పోస్ట్‌పోన్ చేశారు మేకర్స్.
మరోవైపు ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ ఇంకా పూర్తి కాకపోవడంతో నిర్మాత టెన్షన్లో ఉన్నారని చెబుతున్నారు. ఈ తరుణంలో హీరో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిర్మాతకు నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో ఆయన తన రెమ్యూనరేషన్ నుంచి రూ.11 కోట్లు వెనక్కి ఇచ్చేశారని సమాచారం. ఒక స్టార్ హీరో ఇలా నిర్మాత శ్రేయస్సు గురించి ఆలోచించుకుని రెమ్యూనరేషన్ నుంచి భారీ మొత్తం తిరిగిచేయడం నిజంగా ఆదర్శనీయం అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























