రీ రిలీజ్ కానున్న లక్ష్మి నరసింహా

Lakshmi Narasimha Re Release on june 08th

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ ఊపందుకోవడంతో పాత సినిమాలను మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు.ఇందులో ఫస్ట్ టైం రిలీజై సక్సెస్ అవ్వలేని సినిమాలు కూడా వున్నాయి.రీసెంట్ గా మహేష్ బాబు ఖలేజా రీ రిలీజై 12కోట్ల వసూళ్లను రాబట్టి ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఇక నెక్స్ట్ ఈనెల 6న మంచు విష్ణు ఢీ కూడా రీ రిలీజ్ కానుంది. ఇక ఈజాబితాలో సీనియర్ హీరో బాలకృష్ణ లక్ష్మి నరసింహా కూడా చేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2004 లో విడుదలైన ఈసినిమా కమర్షియల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇందులో బాలకృష్ణ నటన ,మణిశర్మ పాటలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక ఈసినిమా ఈనెల 8న థియేటర్లలోకి రానుంది. బాలకృష్ణ బర్త్ డే ఉండడం తో ఈ సందర్భంగా ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు.జయంత్ సి పరాన్జీ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ఆసిన్ హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించాడు.బెల్లంకొండ సురేష్ నిర్మించారు.

ఇక బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 లో నటిస్తున్నాడు.బోయపాటి శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తుండగా 14 రీల్స్ నిర్మిస్తుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.బాలకృష్ణ బర్త్ డే న ఈసినిమా నుండి అప్డేట్ రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్


మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.