ఇది నాకు జీవితాంతం గుర్తుండి పోయే రోజు – సాయి శ్రీనివాస్

bellamkonda sai srineevas Speech at the Bhairavam press Meet

ముగ్గురు హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన సినిమా భైరవం.విజయ్ కనకమేడల దర్శకత్వంలో కె.కె. రాధామోహన్ నిర్మించారు.ఇక నిన్న ఈసినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈప్రెస్ మీట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం.మా అందరికీ కొంచెం గ్యాప్ వచ్చినా ఆడియన్స్ నుంచి ఇంత సపోర్టు, ప్రేమ రావడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా తప్పకుండా మీరందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలి. ఇలాంటి మంచి సినిమా చూస్తే మీకు కూడా ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ఆ రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఇలాంటి సినిమా మీరందరూ చూసి మమ్మల్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా టీమ్ అందరికీ ధన్యవాదాలు. డైరెక్టర్ విజయ్ గారు ఈ సినిమాని ది బెస్ట్ గా తీశారు. ఆయన ఈ సినిమాతో టాప్ డైరెక్టర్స్ లిస్టులోకి చేరారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.మనోజ్ అన్న రోహిత్ అన్న అద్భుతంగా చేశారు. వాళ్లు లేకపోతే ఈ సినిమానే లేదు. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది. చాలా మంది ఫోన్ చేసి ముగ్గురు కూడా పర్ఫార్మెన్స్ ఇరగదీశారు అని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆకలితో ఉన్నప్పుడు వేటాడినట్టు పర్ఫార్మెన్స్ చేశారని చెప్తుంటే హ్యాపీగా అనిపించింది. ఇది నా టెన్త్ ఫిలిం. ఇండస్ట్రీ కి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. అలాగే నా మొదటి సినిమా అల్లుడు శీను చిత్రానికి గాను తెలంగాణ ప్రభుత్వ నుంచి బెస్ట్ ఫిలిం అవార్డ్ వచ్చింది. నాకు ఈరోజు వెరీ హ్యాపీ మూమెంట్. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇది నాకు వెరీ మెమొరబుల్ డే. ఈ సినిమాని, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ. తప్పకుండా ఈ సినిమాని అందరూ థియేటర్స్ లోనే చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు .

ఇక సాయి శ్రీనివాస్  చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు వున్నాయి.అవి…టైసన్ నాయుడు ,కిష్కింధపురి , హైందవ.ఇవ్వన్ని  డిఫ్రెంట్ జోనర్లలో  వస్తున్నాయి.ఇందులో కనీసం రెండు సినిమాలైనా  ఈఏడాది విడుదలకానున్నాయి. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.