ఈ ఏడాది సమ్మర్ సీజన్లో పలు పెద్ద చిత్రాలతో పాటు కొన్ని చిన్న సినిమాలు థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించి మంచి విజయం అందుకున్నాయి. వీటిలో ఒకటి, రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ – గుడ్ బ్యాడ్ అగ్లీ, నాని – హిట్ 3, కళ్యాణ్ రామ్ – అర్జున్ S/O వైజయంతి వంటి భారీ బడ్జెట్ చిత్రాలున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా తమన్నా ‘ఓదెల 2, సమంత నిర్మాతగా తెరకెక్కిన శుభం, శ్రీవిష్ణు సింగిల్ సినిమాలు సక్సెస్ అయ్యాయి. అయితే నితిన్ రాబిన్ హుడ్, సిద్దు జొన్నలగడ్డ జాక్ చిత్రాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. ఇక మార్చి చివరివారంలో ముగ్గురు యంగ్ హీరోలతో రూపొందిన మ్యాడ్ స్క్వేర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ L2 ఎంపురాన్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
ఇక ఇప్పుడు దాదాపు సమ్మర్ సీజన్ పూర్తయినట్టే. మరికొన్ని రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఇంకో రెండు వారాల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని స్కూల్స్, కాలేజీలు తెరుచుకోనున్నాయి. ఈ తరుణంలో పలు చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఒక నెల వ్యవధిలో (జూన్ 05 – జూలై 04) అనేక పెద్ద సినిమాలు ఆడియెన్స్ ముందుకు రానున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..
జూన్ 05 నుంచి జూలై 04 మధ్య విడుదలవుతోన్న సినిమాలు ఇవే..
- జూన్ 05 – థగ్ లైఫ్
- జూన్ 06 – శ్రీశ్రీశ్రీ రాజా వారు
- జూన్ 12 – హరిహర వీరమల్లు
- జూన్ 20 – కుబేర
- జూన్ 20 – 8 వసంతాలు
- జూన్ 27 – కన్నప్ప
- జూన్ 27 – మార్గన్
- జూలై 4 – కింగ్డమ్
ఇక ఈ చిత్రాలతోపాటు మరికొన్ని చిన్న సినిమాలు, అలాగే పలు డబ్బింగ్ మూవీస్ కూడా థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఆ తర్వాత ఆగస్టులో ఎన్టీఆర్-హృతిక్ రోషన్ ‘వార్ 2’, రజినీకాంత్-లోకేష్ కనగరాజ్ ‘కూలీ’ చిత్రాలు వస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు ఒకేరోజు ఆగస్టు 14న రిలీజ్ కానుండటం గమనార్హం. రవితేజ 75వ చిత్రం మాస్ జాతర కూడా ఇదే నెలలో రానుంది. దీంతో మూవీ లవర్స్ ఈ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























