విష్ణు మంచు టైటిల్ రోల్లో నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ భక్తిరస ఇతివృత్తంతో రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి పాత్రలో కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. జూన్ 27న కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే కన్నప్ప నుండి టీజర్ మరియు నాలుగు పాటలను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై విష్ణు మంచు స్పెషల్ ట్వీట్ చేశారు. “ఓన్లీ 28 డేస్ లెఫ్ట్.. ఈరోజు, కన్నప్ప చెన్నై వీధుల్లో గర్జిస్తున్నాడు. తమిళ మీడియాకు కనిపించని దృశ్యాలను చూపిస్తున్నాడు. జూన్ 27న భక్తి, యాక్షన్ మరియు మీ ఆత్మను కదిలించే కథ మీ ముందుకు వస్తోంది” అంటూ అందులో పేర్కొన్నారు.
అయితే ఇటీవలే కన్నప్ప సినిమా ఓ అనుకోని వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాకి సంబంధించిన 90 నిమిషాల ఫుటేజ్ వున్న హార్డ్ డ్రైవ్ మాయమైంది. ముంబై చెందిన ఓ వీఎఫ్ఎక్స్ సంస్థ కన్నప్ప వీఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ చేసి ఆ హార్డ్ డ్రైవ్‌ను కొరియర్ ద్వారా హైదరాబాద్ లోని 24 ఫ్రేమ్స్ ఆఫీస్‌కు పంపించింది. అయితే ఆఫీస్ బాయ్, చరిత అనే మరో ఉద్యోగిని కలిసి ఆ హార్డ్ డ్రైవ్‌ను తీసుకొని పరారయ్యారు. దీంతో నిర్మాతలు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుగుతోంది.
కాగా కన్నప్ప చిత్రంలో ప్రీతి ముఖుంధన్ హీరోయిన్గా నటిస్తుండగా.. మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్, బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక వీరితోపాటుగా విష్ణు మంచు కుమార్తెలు, కుమారుడు ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ సంగీతం సమకూరుస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























