ఓటీటీలోకి వచ్చేసిన రెట్రో

Retro Now Streaming on OTT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘రెట్రో’. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య మే 1న థియేటర్లలోకి వచ్చింది. అయితే తమిళ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగులో మాత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయితే సూర్య యాక్షన్‌కి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసేందుకు మూవీ లవర్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో రెట్రో తాజాగా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసింది. అయితే ముందుగా అనుకున్న డేట్ కన్నా ముందుగానే ఓటీటీలోకి రావడం గమనార్హం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో నేటినుంచి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మాతృక తమిళం సహా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. సో.. థియేటర్‌లో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే కూర్చును వీక్షించే అవకాశాన్ని పొందండి.

కాగా రెట్రో సినిమాను హీరో సూర్య హోం బ్యానర్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై స్వయంగా నిర్మించారు. రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్, కార్తికేయ సంతానం (స్టోన్ బెంచ్ ఫిల్మ్స్‌) సహా నిర్మాతలుగా వ్యవహరించారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా.. జయరామ్, కరుణాకరన్, జోజు జార్జ్ కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు.

రెట్రో కథ ఏంటంటే?

కథానాయకుడైన పారి అలియాస్ పారివేల్ కణ్ణన్ (సూర్య) తండ్రి గ్యాంగ్‌స్టర్‌ తిలక్ (జోజు జార్జ్) దగ్గర పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఒకసారి తిలక్ ఇంటి మీది శత్రువులు దాడి చేయగా, పారి తండ్రి చనిపోతాడు. అప్పుడు తిలక్ భార్య పారిని చేరదీసి పెంచుతుంది. అతడిని తన కన్నకొడుకులా చూసుకుంటుంది. అయితే.. ఇది తొలుత తిలక్‌కి నచ్చదు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా అతడు పారిపై ఇష్టం పెచుకుంటాడు.

ఈ తరుణంలో రుక్మిణి (పూజా హెగ్డే)తో లవ్‌లో పడతాడు. ఆమెని పెళ్లి చేసుకుని ఈ గొడవలకు దూరంగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటాడు. అయితే, పెళ్లికి ముందు చేసిన ఓ ‘గోల్డెన్ ఫిష్’ డీల్ వల్ల తిలక్, పారి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. దీంతో పెళ్లి రోజున రుక్మిణిపై హాత్యాయ‌త్నం జ‌ర‌గ‌డంతో పారికి దూరంగా రాష్ట్రం వ‌దిలి అండ‌మాన్ వెళుతుంది. మరోవైపు పారి అరెస్టై ఐదేళ్లపాటు జైలులో గ‌డ‌పాల్సి వ‌స్తుంది.

అయితే జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన పారి రుక్మిణిని కలిశాడా? ఆమె అతడిని అంగీకరించిందా? అసలు ఈ గోల్డెన్ ఫిష్ డీల్ ఏంటి? పారి, తిలక్ మధ్య శత్రుత్వానికి ఎలా కారణమైంది? అండమాన్ దీవుల్లో ఏం జరిగింది? పారికి తెలిసిన త‌న జ‌న్మ ర‌హాస్యం ఏంటి? తిలక్ అండమాన్ ఎందుకు వ‌చ్చాడు? పోలీసులు పారిని మళ్ళీ ఎందుకు వెతుకుతున్నారు? చివరకు పారి, రుక్మిణి మళ్లీ కలిశారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.