సినిమా సినిమాకు యాక్టింగ్ ఇరగదీస్తూ ప్రతిష్ఠాత్మక అవార్డులను ఖాతాలో వేసుకుంటున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.2023లో పుష్పకి నేషనల్ అవార్డును అందుకోగా ఇక ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇస్తున్నమొదటి గద్దర్ అవార్డులకు ఎంపికయ్యాడు.ఉత్తమ నటుడు విభాగంలో పుష్ప 2 కిగాను అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకోనున్నాడు.ఇప్పటివరకు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు తోపాటు 6 ఫిలింపేర్ ,5 సైమా ,4 నంది అవార్డులను అలాగే వీటితో పాటు ఇంకా పలు అవార్డులను గెలుచుకున్నాడు.ఇక ఇప్పుడు గద్దర్ అవార్డును అందుకోనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ అవార్డు దక్కడంపై అల్లు అర్జున్ స్పందించాడు.చాలా గౌరవంగా భావిస్తున్నాను.ఈక్రెడిట్ అంతా డైరెక్టర్ సుకుమార్ ,నిర్మాతలకు అలాగే పుష్ప టీంకు దక్కుతుంది.ఈఅవార్డు నా ఫ్యాన్స్ కు చెందుతుంది.నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు.అలాగే ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అల్లు అర్జున్ సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు.
అయితే అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన వల్ల పుష్ప 2 సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయాడు.ఇదిలావుంటే పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో సినిమా చేయనున్నాడు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది.ఇందులో 5 గురు హీరోయిన్లు వుండనున్నారని ప్రచారం జరుగుతుంది.సెప్టెంబర్ లో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు.భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా 2027లో విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























