మలయాళం స్టార్ మోహన్ లాల్ నటించిన తుడరుమ్ గత నెలలో వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇప్పటికీ ఈసినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.ఒక్క కేరళలోనే 115 కోట్ల వసూళ్లను రాబట్టి మొదటి 100 కోట్ల సినిమా గా ఆల్ టైం రికార్డు సృష్టించింది.ఓవరాల్ గా ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 230కోట్ల వసూళ్లను రాబట్టి థర్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డుల్లోకెక్కింది.తుడరుమ్ పెద్దగా హైప్ లేకుండా రిలీజ్ కాగా ఊహించని వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటిటిలోకి వస్తుంది.జియో హాట్ స్టార్ ఈనెల 30 నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.మలయాళం తోపాటు తెలుగు ,కన్నడ ,తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.నిజానికి గత వారమే ఓటిటి లోకి రావాల్సి ఉండగా థియేట్రికల్ రన్ సూపర్ గా ఉండడంతో నిర్మాతల కోరిక మేరకు వాయిదావేశారు.ఇక ఈశుక్రవారం నుండి స్ట్రీమింగ్ లోకి రానుంది.మరి థియేటర్లలో అదరగొట్టిన తుడరుమ్ ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తరుణ్ మూర్తి తెరకెక్కించిన ఈసినిమాలో శోభన ,థామస్ మాథ్యూ, షైజో ఆదిమాలి కీలక పాత్రల్లో నటించగా జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.తెలుగులో కూడా ఈసినిమా థియేట్రికల్ రిలీజైనా అనుకున్నంతగా రెస్పాన్స్ తెచ్చుకోలేదు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























