టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘డకాయిట్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ ప్రాజెక్ట్‌లో ఒక పవర్ ఫుల్ రోల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా డకాయిట్ నుంచి ‘ఫైర్ గ్లింప్స్’ పేరుతో స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో అడివి శేష్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించడం ఫైర్ గ్లింప్స్‌పై క్యురియాసిటీని పెంచుతోంది. చూస్తుంటే, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేతో మరోసారి ఆయన తన మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నట్టు అర్ధమవుతుంది. ఇక మృణాల్ ఠాకూర్‌తో అడివి శేష్ కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయినట్టు తెలుస్తుంది.
షనీల్ డియో దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తోంది. డకాయిట్ కథ, స్క్రీన్‌ప్లేను శేష్, షనీల్ డియో సంయుక్తంగా రూపొందించారు. హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో షూటింగ్ జరుగుతున్న మూవీ ఆడియన్స్‌కి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించబోతోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























