VT15 షూటింగ్ లేటెస్ట్ అప్‌డేట్‌

Team VT15 Successfully Wrapped Ananthapur Schedule

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ #VT15 (వర్కింగ్ టైటిల్). “When haunting turns hilarious!!” అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం కోసం గాంధీ థ్రిల్స్, హ్యుమర్ బ్లెండ్ చేస్తూ అద్భుతమైన స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. ఈ సరికొత్త జానర్‌తో ప్రేక్షకులకు వింత అనుభూతిని పంచేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ పంచుకుంది. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్, హైదరాబాద్ అనంతపూర్‌లో జరిగిన రెండు షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. అనంతపూర్‌లోని ప్రముఖ కియా గ్రౌండ్స్, అందమైన గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది.

సినిమా ఫస్ట్ హాఫ్‌లోని థ్రిల్లింగ్ సన్నివేశాలు, పంచ్ హ్యూమర్‌తో కూడిన సీన్స్ ని ఈ షెడ్యూల్స్‌లో చిత్రీకరించారు. రీతికా నాయక్, సత్య, మిర్చి కిరణ్‌ తదితర నటీనటులు ప్రతీ సన్నివేశంలో కామెడీ మెరుపులు నింపారు. వరుణ్ తేజ్, రీతికా నాయక్‌పై పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించిన ఒక అద్భుతమైన అనంతపూర్ షెడ్యూల్ హైలైట్ నిలుస్తుంది.

ఇప్పుడు ఎక్సయిట్మెంట్ మరింత పెరుగుతోంది, #VT15 నెక్స్ట్ ఇంటర్నేషనల్ షెడ్యూల్‌ కోసం సిద్ధమవుతోంది. ఆ షెడ్యూల్ కొరియాలో జరుగుతుంది. ఈ పార్ట్ ద్వారా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండో-కొరియన్ హారర్-కామెడీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి గ్రాండ్ స్కేల్, స్టైల్, హారర్ బ్లెండ్ తో #VT15 జానర్ డిఫైనింగ్ సినిమాగా వుండబోతోంది.

యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇండో-కొరియన్ హారర్ కామెడీ జానర్‌లో ఎమోషన్స్, థ్రిల్స్ రోలర్-కోస్టర్ రైడ్‌గా ఉండబోతోంది. ఇక దర్శకుడు మేర్లపాక గాంధీ, యూవీ క్రియేషన్స్‌తో ఇది వరుణ్ తేజ్ ఫస్ట్ కొలాబరేషన్. అలాగే తొలి ప్రేమ భారీ విజయం తర్వాత, వరుణ్ తేజ్ మరోసారి సెన్సేషనల్, బ్లాక్‌బస్టర్ సంగీత దర్శకుడు ఎస్. థమన్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఇప్పటి వరకు కనిపించని సరికొత్త మేకోవర్‌తో స్క్రీన్‌పై మెస్మరైజ్ చేయనున్నారు. గతంలో ఆయన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో విమర్శకుల ప్రశంసలు పొందిన ‘కంచె’ సినిమా చేశారు. మేర్లపాక గాంధీ గతంలో UV క్రియేషన్స్ బ్యానర్‌పై సెన్సేషనల్ హిట్ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రాన్ని తీశారు. ఈ హిలేరియస్ అడ్వంచరస్ మూవీకి ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.