బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ పురాణపురుషుడిగా రూపొందుతోన్న ఉత్కృష్ట ఇతిహాసం ‘రామాయణం’. సౌత్ హీరోయిన్ సాయి పల్లవి సీతమ్మగా నటిస్తోంది. కన్నడ టాప్ హీరో, ‘కేజీఎఫ్’ సిరీస్ ఫేమ్ యష్ రావణాసురుడుగా ప్రతినాయక పాత్రను పోషిస్తున్నాడు. ప్రముఖ హిందీ నిర్మాత నమిత్ మల్హోత్రా సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో భారతీయ సినిమాలో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రణబీర్ కపూర్ ఇప్పటికే తన భాగాలను పూర్తి చేయగా, మే ప్రారంభంలో ఉజ్జయినిలోని మహాకాళ ఆలయాన్ని సందర్శించిన తర్వాత యష్ తన భాగాలను చిత్రీకరించడం ప్రారంభించాడు. ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. రణబీర్ కపూర్, యష్ తెరపై కలిసి కనిపించేది కొద్దిసేపే అని తెలుస్తోంది. వారిద్దరూ కలిసి స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడం చాలా తక్కువని చెబుతున్నాయి యూనిట్ వర్గాలు.
అయితే దీనికి సహేతుక కారణాన్ని కూడా వారు సోదాహరణంగా చూపిస్తున్నారు. యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం.. రామాయణం రచించిన వాల్మీకి వచనానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు మేకర్స్. వాల్మీకి రామాయణం ప్రకారం, “రాముడు, రావణుడు ఒకరినొకరు చేసుకోరు, మాట్లాడుకోరు. వారి ప్రపంచాలు వేరుగా ఉంటాయి. అసలు సీత అపహరణ తర్వాతే రాముడు, రావణుడి ఉనికి గురించి తెలుసుకుంటాడు. విధి వశాన వారిరివురూ అంతిమ యుద్ధంలో ముఖాముఖి తలపడే వరకు వారి కథలు సమాంతరంగా జరుగుతుంటాయి. లంకలో యుద్ధభూమిలో ఘర్షణ వరకు ఇద్దరూ ఎప్పుడూ కలుసుకోరు.”
ఈ కారణంతోనే రణబీర్ కపూర్, యష్ తెరపై కలిసి కనిపించేది కొద్దిసేపే అని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. తొలిభాగం వచ్చే ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ కానుండగా.. మలిభాగం 2027 దీపావళి పర్వదినం సందర్భంగా విడుదల కానుంది. మొత్తానికి ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలైతే వున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























