ఉస్తాద్ భగత్ సింగ్.. త్వరలో షూటింగ్ పునఃప్రారంభం

Pawan Kalyan's Ustad Bhagath Singh Shooting Resumes Soon

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దీంతో సినిమాను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే అనుకోని కారణాలతో మొదలైన కొన్నిరోజులకే ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఒకింత నిరాశకు గురయ్యారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఇతర సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ అప్పుడప్పుడూ బయటకు వస్తున్నా, ఈ సినిమా నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్ రాలేదు. మధ్యలో ఒకటి, రెండు సార్లు చిన్న చిన్న అప్‌డేట్స్ ఇచ్చింది చిత్రబృందం.

అయితే తాజాగా పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించింది చిత్ర యూనిట్. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పునఃప్రారంభం కానుంది. ఈ మేరకు నేడు హనుమాన్ జయంతి సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. కాగా మూడో వారం నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మళ్ళీ మొదలవనున్నట్టు సమాచారం. ఇందులో పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే జాయిన్ కానున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ప్రొడ్యూసర్స్ యలమంచిలి రవిశంకర్, నవీన్ యెర్నేని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.