మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘విశ్వంభర’. వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈ యేడాది మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రాలలో ఒకటి. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన అద్భుతమైన పోస్టర్లు, విజువల్ వండర్ టీజర్, ఆధ్యాత్మికంగా నిండిన ఫస్ట్ సింగిల్ ‘రామరామ’తో భారీ అంచనాలను పెంచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
UV క్రియేషన్స్ విక్రమ్, వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆమె జన్మదినం జరుపుకున్నారు. ఈ సందర్భంగా త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, విశ్వంభరలోని ఆమె పాత్ర అవనిగా పరిచయం చేసింది చిత్ర యూనిట్. రాజసం ఉట్టిపడే చీరకట్టులో మెరిసిపోతు కనిపించారు త్రిష. ఈ పోస్టర్ కి ట్రమండస్ రెస్పాన్స్ వస్తోంది.
వశిష్ఠ విజన్, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న విశ్వంభర పురాణ గాధలను మోడరన్ సినిమాతో బ్లెండ్ చేస్తోంది. హై క్వాలిటీ VFX, భారీ CGI బడ్జెట్, అద్భుతమైన కథ ప్రేక్షకులకు విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది. ఇక ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ మరో హీరోయిన్ గా నటిస్తుండగా, కునాల్ కపూర్ కీలక పాత్ర పోషించారు. కాగా ఈ చిత్రానికి ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. చోటా కె నాయుడు డీవోపీ, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వహిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























