నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 3’ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. మే 1న భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో తొలి రోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ.43 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో ‘దసరా’ ఓపెనింగ్స్‌ను దాటేసి నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ‘దసరా’ మొదటి రోజు రూ.38 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక హిట్ 3 రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ కొనసాగిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రెండో రోజుల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ.62 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.
ఇక మొదటి రోజు కలెక్షన్స్‌తో 40శాతం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అందుకుంది హిట్ 3. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చెన్నై, కేరళ, బెంగుళూరులో కూడా సాలిడ్ వసూళ్లను దక్కించుకుంటోంది. నేడు, రేపు వీకెండ్ కావడం కలిసొచ్చే అంశం. దీంతో మరో రెండు రోజుల్లో 100కోట్ల మార్క్‌ను క్రాస్ చేసే అవకాశం మెండుగావుంది. ఇక ఈ సినిమాతో వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకోనున్నాడు నాని.
సినిమాలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా వున్నా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా హిట్ 3 చిత్రానికి ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించగా.. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. నాని హోం బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాతో కలిసి యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని గ్రాండ్‌గా నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























