బాహుబలి రీ-రిలీజ్.. పాన్ వరల్డ్ రేంజ్‌లో

Baahubali Re-releasing Pan World in This October

దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి రూపొందించిన కల్ట్ క్లాసిక్స్ ‘బాహుబలి’ చిత్రం త్వరలో మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ విజువల్ వండర్స్ ఈ ఏడాది అక్టోబర్‌లో రీరిలీజ్ కానున్నాయి. ఈ మేరకు చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కాగా నేటితో బాహుబలి 2 విడుదలై 8 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఒక నెటిజెన్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఈ ప్రత్యేక రోజున, ఈ సంవత్సరం అక్టోబర్‌లో బాహుబలి సినిమాను భారతీయ మరియు అంతర్జాతీయ రీ-రిలీజ్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నామని మీ అందరికీ తెలియజేయడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది కేవలం రీ-రిలీజ్ మాత్రమే కాదు, మా ప్రియమైన అభిమానులకు ఇది ఒక వేడుక సంవత్సరం అవుతుంది! నోస్టాల్జియా, కొత్త విషయాలు మరియు కొన్ని అద్భుతమైన ఆశ్చర్యాలను ఆశించండి. చూస్తూ ఉండండి! ది ఎపిక్‌ని మళ్ళీ ఆస్వాదించండి! బాహుబలి రిటర్న్స్” అని అందులో పేర్కొన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.