నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘HIT: ది 3rd కేస్’. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ చిత్రం, టీజర్, ట్రైలర్ పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా హిట్ 3 మే 1న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ఆదివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మావెరిక్ డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే హిట్ 1, హిట్ 2 చిత్రాలలో హీరోలుగా నటించిన విశ్వక్ సేన్, అడివి శేష్ కూడా హాజరయ్యారు. వీరితోపాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొంది.
ఈ సందర్భంగా హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. “ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చినట్లుగా ఉంది. నాని బ్రో గూడచారి ట్రైలర్ లాంచ్ చేశారు. అప్పుడే సినిమా చేస్తానని అన్నారు. ఆయన నన్ను ఒక బ్రదర్ లాగా సపోర్ట్ చేశారు. నాని వలనే రెండు ఫ్రాంచైజీలున్న హీరోని అయ్యాను. హిట్ త్రీ లాస్ట్ 30 మినిట్స్ చూసాను. మామూలుగా ఉండదు. క్రేజీగా ఉంది తెలియని సర్ప్రైజ్లు చాలా ఉన్నాయి.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “రాజమౌళి గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ‘బాహుబలి’ వండర్ఫుల్ ఎక్స్పీరియెన్స్. పట్టుదల అనేది రాజమౌళి గారి నుంచే నేర్చుకున్నాను. సినిమా బాగుంటే పబ్లిక్ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. హిట్ 3 బూకింగ్స్ చూస్తుంటే అది అర్థమవుతుంది. సినిమాకి అద్భుతమైన ఓపెనింగ్స్ కాబోతున్నాయి. మే ఫస్ట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























