‘కంగువా’ తర్వాత కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘రెట్రో’. సూర్య తన హోం బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్పై స్వయంగా నిర్మిస్తుండగా.. క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ టీజర్, ట్రైలర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ అందించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ఈరోజు రెట్రో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనుండగా.. దీనికి టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ సితార ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తుండగా.. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ, మహ్మద్ షఫీక్ అలీ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఇక రెట్రో సినిమా దాదాపు 2గంటల 48నిమిషాల భారీ రన్ టైంతో థియేటర్లలోకి రానుంది. మే 1న తమిళంతోపాటు తెలుగు, హిందీలో కూడా విడుదలకానుంది. అయితే అదే రోజు నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 3’ కూడా వస్తోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద రెట్రోకి హిట్ 3 రూపంలో భారీ పోటీ ఎదురుకానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























