ప్రాఫిట్ జోన్ లోకి గుడ్ బ్యాడ్ అగ్లీ

good bad ugly enters in profit zone

తల అజిత్ ఎట్టకేలకు గుడ్ బ్యాడ్ అగ్లీతో సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. రెండు వారాల క్రితం విడుదలైన ఈసినిమా నిన్నటి వరకు 220కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా తమిళనాడు లో సూపర్ రన్ ను కొనసాగిస్తోంది.నిన్నటి వరకు అక్కడ 140కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. అంతేకాదు కేరళ ,కర్ణాటకలోనూ బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది. అజిత్ కెరీర్ లోనే గుడ్ బ్యాడ్ అగ్లీ అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా తెలుగులోకూడా రిలీజ్ కాగా అనుకున్నంతగా రెస్పాన్స్ రాలేదు.అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈసినిమాలో త్రిష కథానాయికగా నటించగా సునీల్ కీలక పాత్రలో కనిపించాడు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. తమిళంలో మైత్రికి ఇదే మొదటి సినిమా.

ఇక ఈసినిమా తరువాత అజిత్ ఇప్పటివరకు అయితే నెక్స్ట్ సినిమాను లాక్ చేయలేదు.ప్రస్తుతం అజిత్ విదేశాల్లో ఫార్ములా రేసింగ్ తో బిజీగా వున్నాడు.త్వరలోనే నెక్స్ట్ మూవీని ఫైనల్ చేయనున్నాడు.మరి ఈసారి అజిత్ ఏ దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.