ప్యార‌డైజ్, చిరు-ఓదెల ప్రాజెక్ట్స్‌పై బిగ్ అప్‌డేట్స్ ఇచ్చిన నాని

Natural Star Nani Gives Big Updates About Paradise and Chiru-Odela Projects

నేచురల్ స్టార్ నాని వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ‘దసరా, హయ్ నాన్న, సరిపోదా శనివారం’ చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్న ఆయన ప్రస్తుతం ‘హిట్ 3, ప్యారడైజ్’ సినిమాలు చేస్తున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, ‘దసరా’ ఫేం శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న మూవీకి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. వర్కింగ్ టైటిల్ ‘చిరు-ఓదెల’గా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అంతటా భారీ అంచనాలున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ప్యార‌డైజ్ మరియు చిరు-ఓదెల చిత్రాలకు సంబంధించి తాజాగా సాలిడ్ అప్‌డేట్‌లను పంచుకున్నాడు నాని. కాగా నాని హీరోగా నటిస్తున్న హిట్ 3 మే 1న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఒక ఇంట‌ర్వ్యూలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా మీడియా ఈ మూవీలకు సంబంధించి అడిగిన ప్రశ్నలపై స్పందిస్తూ నాని పలు కీలక అప్‌డేట్స్ అందించారు.

ఇంటర్వ్యూలో భాగంగా నాని మాట్లాడుతూ.. ప్యార‌డైజ్ సినిమా త‌ర్వాత ‘చిరు-ఓదెల’ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని తెలిపాడు. ప్యార‌డైజ్ పూర్తవగానే ఆ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలుపెట్టి 2027లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువస్తామని వెల్లడించారు.ఈ మూవీకి సంబంధించిన ప్ర‌తి అప్‌డేట్‌ని షూటింగ్ స్టార్ట్ అయ్యాక ప్ర‌క‌టిస్తామని చెప్పాడు. అలాగే ప్యార‌డైజ్ షూటింగ్ కూడా త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతుంద‌ని, వీలైనంత త్వరగా ముగిస్తామని తెలిపాడు నాని. ఇక ఈ క్రేజీ అప్‌డేట్‌లతో మూవీ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.