100 కోట్ల క్లబ్ లో జాట్

Jaat Joins 100Cr Club

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్ నటించిన జాట్ హిట్ దిశగా దూసుకుపోతుంది.నిన్నటితో ఈసినిమా 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది.అక్షయ్ కుమార్ కేసరి 2 తో పోటీని ఎదుర్కుంటూ డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది జాట్.నిన్నటి వరకు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 102.13 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ఈఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన 4వ హిందీ సినిమాగా జాట్ రికార్డు సృష్టించింది.ఈజాబితాలో 800 కోట్లతో ఛావా మొదటి స్థానంలో కొనసాగుతుండగా 176 కోట్లతో సల్మాన్ ఖాన్ సికందర్ ,168కోట్ల తో స్కై ఫోర్స్ తరువాతి స్థానాల్లో వున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రానున్న రోజుల్లో పెద్ద సినిమాల విడుదలేకపోవడం జాట్ కు కలిసి రానుంది.ఫుల్ రన్ లో ఈసినిమా 150కోట్ల మార్క్ ను టచ్ చేసేలానే వుంది.టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో రణదీప్ హూడా విలన్ పాత్రలో కనిపించగా రెజీనా కసాండ్రా ,సయామి ఖేర్, రమ్యకృష్ణ ,జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు.తమన్ సంగీతం అందించాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ,మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించాయి..డైరెక్టర్ తోపాటు నిర్మాతలకు హిందీలో ఇదే మొదటి సినిమా.

ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుందని రీసెంట్ గా ప్రకటించారు.ఇదే కాంబినేషన్ లో జాట్ 2 తెరకెక్కనుంది.అయితే ఈసినిమా ఇప్పుడప్పుడే సెట్స్ మీదకు వెళ్లేలా కనిపించడం లేదు.మధ్యలో గోపీచంద్ మలినేని తెలుగు సినిమా డైరెక్ట్ చేయనున్నాడని టాక్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.