హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి నిన్న రిలీజై పాజిటీవ్ రివ్యూస్ తోపాటు సాలిడ్ ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. దాంతో మూవీ టీం ఈరోజు పార్క్ హయత్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మంచి సినిమాని అందిస్తే మమ్మల్ని ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. బింబిసార సినిమా సమయంలో కూడా ఇదే మాట చెప్పాను.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోసారి ఆ మాటని రుజువు చేసిన ప్రేక్షకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు. డిస్ట్రిబ్యూటర్స్ కాల్ చేసి మంగళవారం బుధవారం లోగ బ్రేక్ ఈవెన్ అవుతుంది.ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్’అని వాళ్ళు చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఈ కథ ఫస్ట్ డే చెప్పినప్పుడే ఇది ప్యూర్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్ అని చెప్పాడు ప్రదీప్. తనకి కమర్షియల్ సినిమా మేకింగ్ లో మంచి టేస్ట్ ఉంది. కమర్షియల్ సినిమాలో కూడా కొత్తదనం ఉంటేనే ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఈ సినిమాలో చివరి 20 నిమిషాలు ఆడియన్స్ అంతలా కనెక్ట్ అవుతున్నారంటే అది డైరెక్టర్ ఈ కథని అంత ఎమోషనల్ గా నడిపిన విధానం.
ఇంత మంచి కథని అందించిన ప్రదీప్ కి థాంక్యూ. పృథ్వి గారిని స్క్రీన్ మీద చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. సినిమా అనేది థియేటర్ ఎక్స్పీరియన్స్. స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్ కి గురవ్వాలి. ఇలాంటి క్లైమాస్క్ చెప్పిన శ్రీకాంత్ విస్సా కి థాంక్యూ. రఘురాం ఇందులో ఎమోషనల్ సాంగ్స్ ని అద్భుతంగా రాశాడు. మా బ్యానర్ ప్రతి సినిమాలో రామకృష్ణ మాస్టారు ఉంటారు.
మా అబ్బాయి సినిమా చూసి ‘నాన్న మీ సినిమాలో బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఇవే’ అని చెప్పాడు. ఫైట్ మాస్టర్స్ అందరికీ థాంక్యూ. అతనొక్కడే సినిమాకి రాంప్రసాద్ గారు డిఓపి. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఆయనతో ఈ సినిమా కలిసి చేశాం. అప్పుడు ఏ ఎనర్జీ ఉండేదో ఇప్పుడు కూడా అదే ఎనర్జీతో ఉన్నారు. ఈ సినిమా క్లైమాక్స్ ఎక్స్ట్రార్డినరీ అని చెప్పిన ఫస్ట్ పర్సన్ శ్రీకాంత్ గారు.
శ్రీకాంత్ గారితో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. సినిమా చాలా అద్భుతంగా రావాలి మంచి విజయం సాధించాలని నిరంతరం తపనతో పనిచేసిన మా ప్రొడ్యూసర్స్ అశోక్ సునీల్ కి థాంక్యూ. నెక్స్ట్ సినిమా కూడా వారి బ్యానర్ లోనే చేయాలని ఉంది. అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ చేసిన అజినిస్ కు థాంక్యూ. అమ్మ (విజయశాంతి) గారు ఈ సినిమా చేయకపోతే ఈ సినిమా లేదు.
ఈ సినిమా మెయిన్ పిల్లర్ అమ్మ. ఈ కథ చెప్పినప్పుడు నాకు ఒక రియల్ లైఫ్ సంఘటన గుర్తొచ్చింది. నాకు 13 ఏళ్ళు వచ్చే వరకు మా అమ్మ పుట్టిన రోజు ఎప్పుడో నాకు తెలియదు. అమ్మ బర్త్ డే తెలుసుకునే క్రమంలో సంక్రాంతి రోజు పుట్టారని తెలిసింది. పంచాంగాలు అన్ని చూసి జనవరి 15 అమ్మ పుట్టినరోజు అని తెలిసింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఏ రోజు కూడా మా అమ్మగారి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోకుండా నేను లేను. ఈ కథ చెప్పినప్పుడు నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ అది. తల్లిదండ్రులు లేనిది మనం లేము.
మనం జీవితాంతం వారికి రుణపడిపోయి ఉండాలి. అది మన బాధ్యతగా తీసుకోవాలి.ఇంత గొప్ప క్యారెక్టర్ ప్లే చేయడానికి కరెక్ట్ మనిషి విజయశాంతి గారు. ఆ దేవుడే ఈ కథ ద్వారా అమ్మని ఒప్పించాడు. అమ్మకి హృదయపూర్వక కృతజ్ఞతలు.ఈరోజు మాట్లాడడానికి కారణం ప్రేక్షకులు నందమూరి అభిమానులు మాకు ఇచ్చిన సక్సెస్. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. అందరికీ థాంక్యు. జోహార్ ఎన్టీఆర్.. జోహార్ హరికృష్ణ.. జైహింద్ అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























