సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ ‘కుబేర’. ఇప్పటికే సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్, రిలీజ్ డేట్ పోస్టర్ సహా ప్రచార చిత్రాలన్నీ అద్భుతమైన స్పందన రాబట్టుకున్నాయి. ఈ ఏడాది జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో మేకర్స్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు. తమిళ నూత్న సంవత్సరం సందర్భంగా ఈ పాట రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్.. ఏప్రిల్ 20న కుబేర ఫస్ట్ సింగిల్ విడుదలకానున్నట్టు తెలిపారు. అలాగే దీనికి సంబంధించి తాజాగా ప్రోమోను రిలీజ్ చేశారు. నేషనల్ అవార్డు గ్రహీత దర్శకుడు శేఖర్ కమ్ముల, నేషనల్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు డీఎస్పీ మొదటిసారి కలిసి చేస్తున్న చిత్రం!
మరో ఎక్సయిటింగ్ విషయం ఏమిటంటే నేషనల్ అవార్డు గ్రహీత ధనుష్ ఫ్రేమ్‌లో ఉన్నారు! ఈ ముగ్గురూ కలిసి మాస్ డ్యాన్స్ నంబర్ ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ ప్రోమోలో ధనుష్ డ్యాన్స్, విజల్స్ తో వేడుక వాతావరణం ఉంది. బ్యాక్ డ్రాప్ లో డ్యాన్స్ చేస్తూ పెద్ద సంఖ్యలో జనం పండుగ మూడ్‌లో కనిపించారు. ఈ పాట ఫుట్ ట్యాపింగ్ మ్యూజిక్‌తో కూడిన మాస్ సాంగ్ అని హామీ ఇచ్చింది.
శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా శేకర్ కమ్ముల రెగ్యులర్ స్టైల్‌కి భిన్నంగా తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























