టీవీ యాంకర్ టర్న్డ్ హీరో ప్రదీప్ మాచిరాజు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ అవి నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, పాటలు అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ సినిమా వేసవిలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌గా నిలవనుంది. కాగా ఏప్రిల్ 11న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా వారికి థాంక్ యు. మీ ద్వారా సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం మాకు ఎప్పుడూ ఆనందం. చాలా మంచి టీం తో కలిసి పనిచేసే అవకాశం నాకు దొరికింది. రధన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. బాల్ రెడ్డి గారి విజువల్స్ చాలా వండర్ ఫల్ వుంటాయి. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరూ ఈ సినిమాని వోన్ చేసుకుని సొంత సినిమాలా వర్క్ చేశారు.”
“ఈ సినిమాతో చాలామంది కొత్తవారు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ పేర్లు చాలా గట్టిగా వినిపిస్తాయి. నితిన్ భరత్ ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. సరికొత్త స్టైల్‌ని స్క్రీన్‌పై చూపించబోతున్నారు. సందీప్ రాసిన కథ డైలాగ్స్ చాలా రీసౌండ్ చేస్తాయి. భరత్ నితిన్ ఈ సినిమా ద్వారా నాకు బ్రదర్స్ లాగా దొరికారు. మా యూనిట్ మొత్తానికి రాజకుమారి దీపిక. మేము కూడా తనని రాజకుమారిలాగే చూసుకున్నాం. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది.”
“సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సపోర్టుతో తొలి అడుగు వేసాం. ఆయన మా సాంగ్‍ని లాంచ్ చేయడం మాకెంతో బలాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మా సినిమా మొట్టమొదటి టికెట్‌ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు పర్చేజ్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన ఈ సినిమా గురించి తెలుసుకుని ఇంటికి పిలిపించి మాట్లాడారు. ఆ సపోర్ట్‌ని మేము మర్చిపోలేం. రామ్ చరణ్ గారు ‘పెద్ది ఫర్ ప్రదీప్’ అని చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను.”
“ఆయన షూటింగ్‍లో చాలా బిజీగా ఉంటూ కూడా మాకు సమయాన్ని కేటాయించి సపోర్ట్ చేసిన రామ్ చరణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ట్రైలర్ చూశారు. చాలా హ్యాపీగా ఫీలయ్యారు. రామ్ చరణ్ గారు మా అందరితో సరదాగా ఇన్వాల్వ్ అవుతూ టికెట్‌ని ఫస్ట్ టికెట్‌ని పర్చేజ్ చేయడం మాకు ఒక బ్యూటిఫుల్ మెమొరీ. ఎంతో పెద్ద మనసుతో మాకు సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్యూ సో మచ్. ఈ సమ్మర్‌లో ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా నవ్వుకునే సినిమా ఇది.”
“మాకోసం ఒక్క రెండున్నర గంటలు స్పెండ్ చేయండి. సూపర్‌గా ఎంటర్‌టైన్ చేస్తాం. ఇది నా ప్రామిస్. మైత్రి మూవీ మేకర్స్ మా సినిమాని రిలీజ్ చేయడం మా బిగ్గెస్ట్ స్ట్రెంత్. వారిస్తున్న సపోర్టుకి మా టీం తరఫున మా టీం అందరి తరపునుంచి థాంక్యూ సో మచ్. మా సినిమా రిలీజ్ ముందే ఓటిటి శాటిలైట్ క్లోజ్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది మా కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేస్తున్నారంటే తప్పకుండా ఇది ప్రేక్షకులు కూడా నచ్చుతుందని నమ్ముతున్నాం. అందరికీ థాంక్యూ వెరీమచ్” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























