నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ‘అర్జున్ S/O వైజయంతి’ టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ ‘నాయాల్ది’ సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ‘ముచ్చటగా బంధాలే’ అంటూ సాగే ఈ పాట ఏప్రిల్ 9న రిలీజ్ కానున్నట్టు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ పంచుకున్నారు.
మదర్ అండ్ సన్ బాడింగ్ ని బ్యూటీఫుల్ ప్రజెంట్ చేసిన సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. కాగా రేపు చిత్తూరు శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో గ్రాండ్ ఈవెంట్ లో ఈ సాంగ్ ని లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మూవీ వండర్ ఫుల్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని హామీ ఇస్తుంది. సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ తమ్మిరాజు, స్క్రీన్‌ప్లే శ్రీకాంత్ విస్సా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























