తమిళ స్టార్ హీరో తల అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మరో 3 రోజుల్లో విడుదలకానుంది. ఈసినిమాపై తమిళంలో భారీ అంచనాలు వున్నాయి. ఇక రెండు రోజుల క్రితం తమిళ ట్రైలర్ విడుదలకాగా ఈరోజు తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ ఫ్యాన్స్ కు నచ్చేలా కట్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించింది. దాంతో తెలుగులో కూడా ఈసినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ పెద్దగా చేయకపోయిన ఇప్పటికే కావల్సిన బజ్ వచ్చింది.చాలా రోజుల తరువాత అజిత్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మార్క్ ఆంటోని ఫేమ్ అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించగా త్రిష కథానాయికగా నటించింది.సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమాకు రన్ టైం కూడా తక్కువగానే ఉండనుంది.దాదాపు 2 గంటల 19నిమిషాల నిడివి తో థియేటర్లలోకి రానుంది.ఈసినిమాపై అజిత్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఇక తమిళంలో ఈసినిమా సోలోగా వస్తుండగా తెలుగులో మాత్రం పోటీఎదురుకానుంది. ఈనెల 10న యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన జాక్ కూడా విడుదలవుతుంది.దాంతో బాక్సాఫీస్ వద్ద గుడ్ బ్యాడ్ అగ్లీకి పోటీ ఎదురుకానుంది.ఇక అజిత్ సాలిడ్ హిట్ కొట్టి చాలా ఏళ్ళు దాటింది. ఈఏడాది తనకు ఇది రెండో రిలీజ్.ఫిబ్రవరిలో విడా ముయార్చి తో రాగ అంచనాలను అందుకోలేకపోయింది.మరి ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ తోనైనా హిట్ కొట్టి ఫామ్ లోకి వస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























