గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ రిలీజ్

good bad ugly trailer is out now

తమిళ స్టార్ హీరో తల అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మరో 6 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఆఫ్ లైన్ ప్రమోషన్స్ ఏమి చేయకపోయినా ఇప్పటికే కావల్సిన బజ్ వచ్చింది.ఇక ఈ రోజు ట్రైలర్ ను రిలీజు చేశారు.ఈ ట్రైలర్ అంచనాలను మరింతగా పెంచింది.యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ఈ ట్రైలర్ లో అజిత్ ను ఓ రేంజ్ లో చూపించారు. ఫ్యాన్స్ కు మాత్రం ఈ ట్రైలర్ ఫుల్ కిక్ ఇచ్చింది.మొత్తానికి చాలా రోజుల తరువాత అజిత్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తమిళ వెర్షన్ ట్రైలర్ ను మాత్రమే రిలీజ్ చేశారు.తెలుగు వెర్షన్ ట్రైలర్ ను రేపు రిలీజ్ చేసే ఛాన్స్ వుంది.ఈసినిమాను మార్క్ ఆంటోని ఫేమ్ అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించగా త్రిష కథానాయికగా నటించింది.సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.కోలీవుడ్ లో మైత్రికి ఇదే మొదటి సినిమా.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

ఈసినిమా తమిళంలో సోలోగా వస్తుండగా తెలుగులో మాత్రం పోటీఎదురుకానుంది.ఈనెల 10న సిద్దు జొన్నలగడ్డ జాక్ కూడా విడుదలవుతుంది.ఇక అజిత్ కు ఈ ఏడాది ఇది రెండో రిలీజ్.ఫిబ్రవరిలో విడా ముయార్చి తో రాగ అంచనాలను అందుకోలేకపోయింది.అయినా ఆప్రభావం గుడ్ బ్యాడ్ అగ్లీ పై పడలేదు.భారీ అంచనాలతో వస్తున్న ఈసినిమా రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.