ది ప్యారడైజ్ షూటింగ్ అప్డేట్

The Paradise will go on floors on May 2

నేచురల్ స్టార్ నాని- డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ది ప్యారడైజ్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.గతంలో ఇదే కాంబోలో వచ్చిన దసరా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.దాంతో ది ప్యారడైజ్ భారీ అంచనాలు వున్నాయి.రీసెంట్ గా ది ప్యారడైజ్ గ్లింప్స్ ను రిలీజ్ చేసి సినిమా ఎలా ఉంటుందో చెప్పేశారు. ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని పాయింట్ తో ఈసినిమా రానుంది.నాని ఇందులో సరికొత్త గెటప్ లో కనిపించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.అన్ని కుదిరితే మే 2నుండి షూటింగ్ స్టార్ట్ కానుంది.నాని కొంచెం ఆలస్యంగా జాయిన్ కానున్నాడు.అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది.పాన్ ఇండియా రిలీజ్ తోపాటు ఇంగ్లీష్ ,స్పానిష్ లో కూడా విడుదలకానుంది.

ఇక నాని ప్రస్తుతం హిట్ 3 చేస్తున్నాడు. షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. మే 1న రిలీజ్ కానుంది.శైలేష్ కొలను డైరక్ట్ చేస్తుండగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా ఈసినిమాను నిర్మిస్తుంది.ఈసినిమా హిట్ అయితే నాని వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకోనున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.