‘డీజే టిల్లు’ ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బస్టర్స్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాక్ – కొంచెం క్రాక్’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో సరికొత్త జోనర్‌లో ఈ మూవీ రూపొందుతోంది. సిద్ధు సరసన ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన జాక్ టీజర్ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ముమ్మురం చేసిన మేకర్స్ తాజాగా జాక్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే హిలేరియస్‌గా ఉంది. సిద్దు జొన్నలగడ్డ తన మార్క్ డైలాగ్ డెలివరీ, ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్, డిఫరెంట్ మ్యానరిజంతో అలరించగా, వైష్ణవి పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకుంది. అయితే స్టోరీలో కేవలం లవ్ ట్రాక్ ఒక్కటే కాకుండా టెర్రరిస్టులు, వారిని పట్టుకునేందుకు ప్రయత్నించే ప్రభుత్వ సంస్థలు, మధ్యలోకి జాక్ ఎంటరవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సీన్స్, గన్స్ ఫైరింగ్ సినిమాలోని రెండో కోణాన్ని చూపిస్తుంది.
జాక్ పాత్రలో సిద్ధు క్రాక్ గాడుగా ప్రేక్షకులను మెప్పించటం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు సిద్దు, వైష్ణవి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. మొత్తానికి మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ నుంచి వస్తోన్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు కూడా భారీగానే వున్నాయి.
కాగా ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో మెప్పించనున్నారు. ఇక ఈ చిత్రం కోసం మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి అద్భుతమైన సౌండ్ ట్రాక్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ‘జాక్- కొంచెం క్రాక్’ సినిమాని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























