రాబిన్‌హుడ్‌లో ఆయన ఎంట్రీకి థియేటర్ అదిరిపోయింది

Director Venky Kudumula Thanks Telugu Audience For Robinhood Success,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Robinhood Official Trailer,Nithiin,Sreeleela,Venky Kudumula,GV Prakash,Mythri Movie Makers,Robinhood Movie,Robinhood,Nithiin Robinhood,Robinhood Nithiin Latest Movie,Nithiin Sreeleela Movie,Nithiin Latest Movies,Robinhood Telugu Movie,Robinhood David Warner,Sreeleela Movies,Sreeleela New Movie,Robinhood Movie Updates,Robinhood Movie News,Robinhood Success,Robinhood Success Celebration,Director Venky Kudumula,Venky Kudumula Movies,Venky Kudumula Latest Movie,Venky Kudumula New Movie,Venky Kudumula About Robinhood Movie,Venky Kudumula Interview,Venky Kudumula Exclusive Interview,Venky Kudumula Latest Interview,Director Venky Kudumula About David Warner Role,David Warner

హీరో నితిన్ సమ్మర్ క్లీన్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మార్చి 28న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈరోజు రిలీజ్ అయిన మా రాబిన్ హుడ్ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము రెండు థియేటర్స్ ని విజిట్ చేశాము. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు.”

“నితిన్ గారి పెర్ఫార్మెన్స్ తో పాటు వెన్నెల కిషోర్ గారు, రాజేంద్రప్రసాద్ గారి ట్రాక్ ని హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్, ట్విస్ట్ ల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సినిమాని చిన్నపిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు.”

“వార్నర్ గారి క్యామియోకి కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆయన ఎంట్రీకి థియేటర్ అదిరిపోయింది. ఇది ఫ్యామిలీ అందరికీ నచ్చే సినిమా. ఈ ఉగాదికి చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది. అందరూ థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.