తారక్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డ జపాన్ లేడీ ఫ్యాన్స్

NTR Shares Japanese Lady Fan Learned Telugu After Watching RRR

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘దేవ‌ర’ రేపు జపాన్ లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. దీంతో మూవీ ప్ర‌మోష‌న్స్‌ కోసం తార‌క్ జ‌పాన్ వెళ్లాడు. ఈ క్రమంలో స్థానిక మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఈ సందర్భంగా జూనియర్ ని కలుసుకోవడానికి జపాన్ అభిమానులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అక్కడ ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ కనపడగానే ఆయనను చుట్టుముట్టి తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా ఓ జపనీస్ లేడీ ఫ్యాన్ తెలుగులో మాట్లాడి తారక్ ని ఆశ్చర్యపరిచింది. “తార‌క్ అన్న.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసి నేను తెలుగు నేర్చుకున్నాను. నేను మీతో తెలుగులో మాట్లాడ‌టం కోసం రెండేళ్లుగా ఈ తెలుగు బుక్‌ని ప‌ట్టుకుని తిరుగుతున్నాను. మీరు నా లైఫ్‌కి ఇన్స్పిరేషన్” అని ఆమె ఎంతో ఉద్వేగంగా చెప్పింది. దీనికి ఎన్టీఆర్ స్పందిస్తూ.. “మీరు మా అందరికీ బిగ్ ఇన్స్పిరేషన్” అంటూ ఆ అభిమానికి ఆటోగ్రాఫ్‌ ఇచ్చారు. అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నాడు.

“నా జపాన్ సందర్శన నాకు ఎప్పుడూ అందమైన జ్ఞాపకాలను మిగిల్చింది. కానీ ఈ సందర్శన మాత్రం భిన్నంగా అనిపించింది. ఒక జపనీస్ అభిమాని RRR చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నానని చెప్పడం నన్ను నిజంగా కదిలించింది. సినిమా మరియు భాషల ప్రేమికురాలుగా, సంస్కృతుల మధ్య వారధిగా ఉండటానికి సినిమా శక్తి మరియు ఒక అభిమానిని ఒక భాష నేర్చుకోవడానికి ప్రోత్సహించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రపంచాన్ని పర్యటించేటప్పుడు భారతీయ సినిమాను జరుపుకోవడానికి మరో కారణం.” అని అందులో పేర్కొన్నారు ఎన్టీఆర్‌.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.