రామ్ చరణ్‌కి బర్త్ డే విషెస్ తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్

Pawan Kalyan and NTR Extends Birthday Wishes To Ram Charan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తన బాబాయి, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చరణ్ క్లోజ్ ఫ్రెండ్, టాలీవుడ్ స్టార్ హీరో, జూనియర్ ఎన్టీఆర్ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు వీరు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్ట్ పంచుకున్నారు. ఇక వీరితోపాటుగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు దర్శకులు, నటీనటులు రామ్ చరణ్‌కి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అంతకుముందే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్‌కి బర్త్ డే విషెస్ తెలియజేశారు. అలాగే చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈరోజు ఆయన ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ టైటిల్ ఖరారు చేయబడింది. ఇన్నాళ్ళూ #RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరించబడుతున్న ఈ సినిమాకి ‘పెద్ది’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. అలాగే రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సాన ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా.. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.