దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. అదే బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఛావా’ గురించే. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్‌ను రాబడుతుంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ విడుదలైన అన్నిచోట్లా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో హిందీ వెర్షన్లో ఇప్పటివరకూ 500కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా తెలుగులో విడుదలైన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ సంస్థ దీనిని రెండు తెలుగు రాష్ట్రాలలో 550కి పైగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేసింది. అయితే ఒరిజినల్ వెర్షన్ రిలీజై మూడు వారాల గ్యాప్ తరువాత విడుదలైనా ఇక్కడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో తొలి రోజు 3.03కోట్ల గ్రాస్‌తో అదిరిపోయే వసూళ్లను రాబట్టుకుంది.
ఈ సందర్భంగా ఒక్క రోజే బుక్ మై షోలో తెలుగు వెర్షన్ కు లక్షకుపైగా టికెట్లు తెగడం విశేషం. ఇక తొలిరోజు కన్నా రెండో రోజు ఎక్కువ వసూళ్లను కళ్లజూసింది ఛావా. నిన్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఉన్నప్పటికీ ఇదేఊపు కంటిన్యూ చేస్తూ మంచి వసూళ్లే రాబట్టుకుంది. ఈ క్రమంలో మూడు రోజుల్లో మొత్తం 9.46 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది.
ఓవరాల్‌గా చూస్తే ఇంతకుముందు ‘యానిమల్, జవాన్’ చిత్రాల తరహాలో ఛావా తెలుగులో సాలిడ్ కలెక్షన్స్ అందుకుంటుంది. తద్వారా తెలుగులో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన మూడో హిందీ డబ్బింగ్ సినిమాగా నిలిచింది ఛావా. ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి నిర్మాత బన్నీ వాస్ తాజాగా సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు.

కాగా మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్ శంభాజీగా నటించగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆయన భార్య యేసుబాయి భోంస్లేగా కనిపించింది. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా ఔరంగజేబుగా, డయానా పెంటీ జినత్-ఉన్-నిస్సా బేగంగా, అశుతోష్ రాణా హంబిర్రావ్ మోహితేగా, దివ్య దత్తా సోయారాబాయిగా కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాను దినేష్ విజన్ గ్రాండ్‌గా నిర్మించాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























