ట్యాలెంటెడ్ హీరో జీవా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా లీడ్ రోల్స్‌లో నటించిన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ ‘అగత్యా’. వెల్స్ ఫిల్మ్ ఇంటర్‌నేషనల్, వామిండియా బ్యానర్స్‌పై ఇషారి కే గణేష్, అనీష్ అర్జున్ దేవ్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహించారు. కాగా ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిచింది. ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్‌తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ ప్రిమియర్‌లో సినిమాని వీక్షించిన హీరో జీవా అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
- అందరికీ నమస్కారం. రంగం సినిమా నుంచి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరి సపోర్ట్‌కి థాంక్ యూ.
- అగత్యా కోసం గత మూడేళ్ళుగా చాలా హార్డ్ వర్క్ చేశాం. అర్జున్ గారు, రాశితో కలిసి నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్.
- డైరెక్టర్ గారు అద్భుతమైన స్క్రిప్ట్‌తో గొప్ప సినిమా ఇచ్చారు, సినిమాకి చాలా గొప్ప రెస్పాన్స్ వస్తోంది.
- అందరూ థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా ఇది.
- హెవీ సిజీ వర్క్, వీఎఫ్ఎక్స్ వున్న సినిమా ఇది. ఇంటర్‌నేషనల్ టెక్నికల్ టీంతో ఈ సినిమా చేశాం.
- అవతార్ స్థాయిలో షూట్ చేశాం. చాలా కొత్త టెక్నాలజీని వాడాం. ఆడియన్స్‌కి బిగ్ స్క్రీన్‌పై గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
- మన ల్యాండ్, కల్చర్, హెరిటేజ్, మెడిషన్‌ని సెలబ్రేట్ చేసుకునే సినిమా ఇది.
- హారర్‌తో పాటు మంచి ఎమోషనల్ హై కూడా ఆడియన్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు.
- నాకు ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటినుంచో వుండేది. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది.
- దేశవ్యాప్తంగా ప్రేక్షకులని అలరించే కంటెంట్ వున్న సినిమా.
- ఈ సినిమా ఫస్ట్ క్రిడిట్ డైరెక్టర్ విజయ్ గారికి దక్కుతుంది. ప్రతి క్రాఫ్ట్‌లో చాలా కేర్ తీసుకున్నారు. అద్భుతమైన సెట్ వర్క్ వుంది.
- ఆర్ట్ డైరెక్టర్ షన్ముఖం అద్భుతమైన సెట్స్‌ని తీర్చిదిద్దారు. కెమరా వర్క్, సౌండ్ డిజైన్ కూడా సినిమాకి స్పెషల్ హైలెట్‌గా నిలిచింది.
- ఈ సినిమా కోసం డైరెక్టర్ గారు చాలా రీసెర్చ్ చేశారు. భారతీయ ఔషదాలు, వైద్యానికి సంధించిన చాలా విలువైన అంశాలు ఇందులో వున్నాయి.
- అవి ఆడియన్స్‌కి చాలా కొత్త అనుభూతిని పంచుతాయి. అందరికీ రిలేట్ అయ్యే సినిమా ఇది.
- అర్జున్ గారికి నేను బిగ్ ఫ్యాన్‌ని. ఆయనతో కలసి వర్క్ చేయడం బ్లెసింగ్‌గా భావిస్తున్నాను. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.
- దాదాపు ఇందులో సిజీలో షూట్ చేశాం. సినిమా చూసిన తర్వాత ఆయన చాలా సర్‌ప్రైజ్ అయ్యారు.
- రాశితో వర్క్ చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్. తను సెట్స్‌లో తెలుగులోనే మాట్లాడుతుంది. చాలా ఫ్రెండ్లీగా వుంటుంది.
- యువన్ శంకర్ రాజా నా ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయనతో కలసి ఐదారు సినిమా చేశాను.
- ప్రతి సినిమా మ్యూజిక్ ఐకానిక్‌గా నిలిచింది. తన మ్యూజిక్ ఈ సినిమా గ్రాండియర్‌ని మరింతగా పెంచింది.
- నేను స్టొరీ బేస్డ్ సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. ఇలాంటి మల్టీ స్టారర్స్ చేయడం చాలా ఇష్టం.
- బిగ్ కాన్వాస్ వున్న సినిమా ఇది. ఆడియన్స్ తప్పకుండా థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను.
- మంచి కథల కోసం చూస్తున్నాను. మంచి స్క్రిప్ట్ కుదిరితే తెలుగులో సినిమా చేయాలని వుంది.
- నాకు తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం. తెలుగు ఆడియన్స్ ప్రేమకి రుణపడి వుంటాను.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Businessman Re-Release Trailer 4K | Mahesh Babu | Kajal Aggarwal | Puri Jagannadh | Thaman S | TFN
02:03

Businessman Re Release Celebrations | Happy Birthday Mahesh Babu | Kajal Aggarwal | Puri Jagannadh
03:06

Guntur Kaaram Teaser Public Talk | Guntur Kaaram Teaser Reaction | Mahesh Babu | Trivikram | Thaman
05:44

సితారతో కలిసి దిల్ రాజు కొడుకు ఫస్ట్ బర్త్ డేకి వచ్చిన మహేష్ బాబు 😍 | #MaheshBabu | #Sitara | TFN
00:58
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























