నటీనటులు: సందీప్ కిషన్, రీతు వర్మ, రావు రమేష్, అన్షు, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి, హైపర్ ఆది తదితరులు
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ
ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్
నిర్మాణం: ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్
నిర్మాత: రాజేష్ దండా
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మజాకా’. ఆయన కెరీర్లో ఇది ల్యాండ్ మార్క్ 30వ సినిమా కావడం విశేషం. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ మూవీలో ‘పెళ్లిచూపులు’ ఫేమ్ రీతు వర్మ హీరోయిన్గా నటించింది. అలాగే ‘మన్మధుడు’ ఫేమ్ అన్షు ఈ సినిమా ద్వారా మళ్ళీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్ సహా ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ నేపథ్యంలో కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన మజాకా శివరాత్రి కానుకగా నేడు థియేటర్లలో విడుదలైంది. అయితే మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మజాకా ఎలా ఉంది? సందీప్ కిషన్ ఈ ల్యాండ్ మార్క్ మూవీతో హిట్ అందుకున్నాడా? సీనియర్ నటి అన్షు సెకండ్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుందా? ధమాకా తర్వాత త్రినాధరావు నక్కిన మరోసారి తన మార్క్ డైరెక్షన్ చూపించగలిగాడా? వంటి ప్రశ్నలకు సంధానం తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ:-
వెంకట రమణ (రావు రమేష్) కృష్ణ (సందీప్ కిషన్) తండ్రీ కొడుకులు. ప్రసవ సమయంలో కృష్ణ తల్లి చనిపోతుంది. దీంతో కొడుకును అల్లారుముద్దుగా పెంచుతాడు. పెద్దయ్యాక ఒక స్నేహితుడిలా మెలుగుతుంటాడు. కొడుకుపై అభిమానంతో వెంకట రమణ మరో పెళ్లి చేసుకోడు. సందీప్ ఒకరిని పెళ్లి చేసుకొని కుటుంబంతో హాయిగా జీవితం గడపాలని కోరుకుంటుంటాడు.
అయితే ఆడదిక్కు లేని ఇంటికి తమ కూతురిని పంపించడానికి కొందరు తిరస్కరింస్తారు. దీంతో కొడుకుకి పెళ్లి సంబంధాలు బాచినట్టే వచ్చి వెనక్కి వెళ్లిపోతుంటాయి. దీనికి పరిష్కారంగా రావు రమేష్, కొడుకు పెళ్లి కంటే ముందు తను పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. ఈ నేపథ్యంలో రావు రమేష్ యశోద (అన్షు)తో ప్రేమలో పడతాడు. మరోవైపుసందీప్ కిషన్ మీరా (రీతు వర్మ)తో ప్రేమలో పడతాడు.
ఇదిలావుండగానే అనుకోని కారణాల రీత్యా సందీప్, రావు రమేష్ వ్యాపారవేత్త అయిన భార్గవ వర్మ (మురళీ శర్మ)కు శత్రువులుగా మారతారు. ఇంకోవైపు సందీప్, రావు రమేష్ ఇద్దరూ తమ పెళ్లిళ్ల గురించి ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని భావిస్తారు. అదేసమయంలో వారికి ఒక నిజం తెలుస్తుంది. అదేంటి?
వారిద్దరూ పెళ్లి చేసుకున్నారా? అసలు తండ్రి ప్రేమ విషయం కొడుక్కి, కొడుకు ప్రేమ విషయం తండ్రికి ఎప్పుడు తెలిసింది? యశోద, మీరా మధ్య శత్రుత్వం ఏమిటి? వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? భార్గవ వర్మతో వైరం ఏమైంది? అతను ఎందుకు వీరి పెళ్లిళ్లకు అడ్డుపడుతున్నాడు? తమకు ఎదురైన అడ్డంకులను తొలగించి రమణ, కృష్ణ పెళ్లిళ్లు చేసుకున్నారా? లేదా? మిగిలిన అనేది మిగతా కథ.
విశ్లేషణ:-
కథగా చూస్తే, మజాకా రొటీన్ స్టోరీ అనిపిస్తుంది. కొడుకుకి పెళ్ళిసంబంధాల కోసం తండ్రి ప్రయత్నించడం, అవి సెట్ కాకపోవడం, ఈ నేపథ్యంలో వచ్చే ఎంటర్టైన్మెంట్.. ఇలా చాల సినిమాల్లో చూసిందే. అయితే ఇక్కడే దర్శకుడు త్రినాధరావు నక్కిన ఒక మ్యాజిక్ చేసాడు. కొడుకు కంటే ముందుగా తండ్రి పెళ్ళిచేసుకోవాలని భావించడం కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది.
ఫస్టాఫ్ అంతా ఫుల్ ఫన్ జోన్లో సాగుతుంది. ఈ క్రమంలో వచ్చే కామెడీ సన్నివేశాలు సినిమాను ఎక్కడా బోర్ కొట్టకుండా చేస్తాయి. అలాగే హీరో, హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ మెప్పిస్తుంది. వీరి మధ్య వచ్చే సీన్స్ యువతను అలరిస్తాయి. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సన్నివేశాలతో సెకండాఫ్‌పై అంచనాలు పెరుగుతాయి. ఇక్కడినుంచి కథలో వేగం పెరుగుతుంది. చివరి 20నిమిషాలు క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్‌గా ముగుస్తుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. సందీప్ కిషన్‌కి ఇలాంటి పాత్రలు కొట్టినపిండి. సందీప్ నటనలో చాలా ఈజ్ ఉంటుంది. అది ఈ తరహా కథలు పాడినప్పుడు ఇంకొంచెం హైలైట్ అవుతుంది. అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడిగా ఆయన ఒదిగిపోయాడు. కామెడీ టైమింగ్‌తో, వన్ లైనర్ డైలాగ్స్‌తో మెప్పించాడు. అలాగే హీరోయిన్ రీతు వర్మకి చాలారోజుల తర్వాత మంచి రోల్ దొరికింది. ఆమె నటనలో ఒకరకమైన హుందాతనం ఉంటుంది. తన స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. తెరపై ఆమె చాలా చాలా క్యూట్‌గా ఉంది. నటనతో పాటు సాంగ్స్ లోనూ మెప్పించింది రీతు.
వీరితోపాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సీనియర్ నటుడు రావు రమేష్ గురించి. గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాల్లో ఆయన వేసిన పాత్రలు, వాటిలో ఆయన చూపించిన నటన అమోఘం. ఈ జెనరేషన్లో ఇన్ని వేరియేషన్స్ చేయగలిగిన క్యారక్టర్ ఆర్టిస్ట్ తెలుగు పరిశ్రమలో ఉండటం మనందరికీ గర్వకారణం. ఈ సినిమాలోనూ రావు రమేష్ అద్భుతమైన పాత్ర పోషించారు. ఇందులో ఆయన కేవలం ఫైట్స్ చేయలేదు అంతే. మూవీ మొత్తం ఆయనకు హీరోకి సమానమైన స్క్రీన్ షేరింగ్ ఉందంటే అర్థంచేసుకోవచ్చు, తన పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో.
అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించిన సీనియర్ నటి అన్షు గురించి కూడా చెప్పుకోవాలి. ‘దాదాపు రెండు దశాబ్దాల క్రితం ‘మన్మథుడు’ మూవీలో కథానాయికగా నటించిన ఆమె ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలేవీ చేయలేదు. చాలాకాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు ఈ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇందులో ఆమెకి ప్రాధాన్యమున్న పాత్రే లభించింది. కథాగమనాన్ని మలుపు తిప్పే పాత్రలో అన్షు పరిణతి గల నటనను ప్రదర్శించి ఆకట్టుకుంది. ఆమెతోపాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు డీసెంట్‌గా నటించారు.
ఇక టెక్నికల్ విషయానికొస్తే.. లియోన్ జేమ్స్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. సాంగ్స్ వినసొంపుగా ఉన్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గట్టుగా ఉంది. ఇలాంటి కమర్షియల్ సినిమాలకు ఎలాంటి సంగీతం కావాలో లియోన్ జేమ్స్ అదే ఇచ్చాడు. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో ఎస్సెట్ అని చెప్పొచ్చు. అలాగే చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. ఇంకా నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉండి నిర్మాతలు ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదని అర్ధమవుతుంది.
ఓవరాల్‌గా చూస్తే, మజాకా మంచి ఎంటర్టైనర్ మూవీ అని చెప్పొచ్చు. ఆడియెన్స్‌కి మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కేవలం యూత్ అనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలావుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ని సైతం ఈ చిత్రం మెప్పిస్తుంది. ఈ చిత్రంతో సందీప్ కిషన్ హిట్ అందుకున్నట్టే అని చెప్పొచ్చు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























