మరో రెండు రోజుల్లో మహాశివరాత్రి పండుగ రాబోతోంది. ఆరోజున తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు పూజలు, పునస్కారాలలో నిమగ్నమై ఉంటారు. అలాగే ఉపవాసం మరియు జాగరణ వంటి నియమాలతో ఆ పరమ శివుడిని తలచుకుంటూ రోజంతా నిష్టగా గడుపుతారు. అయితే మరోవైపు సినీ ప్రియులు మాత్రం కొత్త సినిమాలు లేదా స్టార్ హీరోల సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో శివరాత్రి పండుగ సందర్భంగా ఒక స్టార్ హీరో చిత్రాలు ప్రత్యేకంగా ప్రదర్శించబడటానికి సిద్ధమయ్యాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలు స్పెషల్ స్క్రీనింగ్ కానున్నాయి. అవేంటంటే..? ఇటీవలే ఎన్టీఆర్ ప్రధానపాత్రలో కొరటాల శివ రూపొందించిన ‘దేవర’, మరియు తారక్ కెరీర్ తొలినాళ్లలో దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో నటించిన ‘సింహాద్రి’ చిత్రాలు.
కాగా థియేటర్లలో అదరగొట్టిన ఈ సినిమాలు ఆ తర్వాత ఓటీటీ మరియు టీవీలలో కూడా మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. ఈ క్రమంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ప్రముఖ థియేటర్ దేవిలో దేవర సినిమా స్పెషల్ షో ఏర్పాటుచేయనున్నారు. అలాగే సింహాద్రి చిత్రాన్ని కర్ణాటకలోని బెంగళూరులో సంధ్య థియేటర్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించనున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించి బుక్ మై షో లో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. దీంతో తమ అభిమాన హీరోల చిత్రాలను వీక్షించేందుకు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























