పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ మోస్ట్ ఎవైటెడ్ 30వ చిత్రం ‘మజాకా’ ఇప్పటికే హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ధమాక బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎంటర్ టైనింగ్ అండ్ ఎంగేజింగ్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రావు రమేష్, సందీప్ కిషన్ తండ్రీ కొడుకులు. ఎటువంటి కట్టుబాట్లు, బాధ్యతలు లేకుండా జీవితాన్ని బ్యాచిలర్స్ లా హాయిగా గడుపుతుంటారు. సందీప్‌కు రీతు వర్మపై ప్రేమ కలుగుతుంది, అతని తండ్రి రావు రమేష్ అన్షుని ఇష్టపడతాడు. దీంతో సాఫీగా వున్న వీరి జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది.
ట్రైలర్ మజాకా మాక్స్ ఎంటర్టైన్మెంట్ యొక్క గ్లింప్స్ ని అందిస్తుంది, సినిమాలో వుండే వినోదం, ఉత్సాహాన్ని రుచి చూపిస్తుంది. త్రినాధ రావు నక్కిన నలుగురు ప్రధాన పాత్రల చుట్టూ హిలేరియస్ కథను రూపొందించారు, పుష్కలంగా హ్యుమర్ ని క్రియేట్ చేశారు. బాలయ్య బాబు డైలాగ్స్ ట్రైలర్‌కు హ్యూమరస్ ముగింపును ఇస్తుంది.
ఇది సందీప్ కిషన్ ఫస్ట్ ఫుల్ లెంత్ ఫన్ రోల్. తన పాత్రని అద్భుతమైన ఎనర్జీతో చేశాడు. రావు రమేష్ తండ్రిగా ఆకట్టుకునే నటన కనబరిచారు. రీతు వర్మ పాత్ర కూడా ఆకట్టుకుంది. సందీప్ రీతు మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా ఉన్నాయి. అన్షు పాత్ర చాలా వినోదాన్ని అందించింది.
నిజార్ షఫీ ఆకట్టుకునే విజువల్స్ అందించారు. లియోన్ జేమ్స్ ఎనర్జిటిక్ నేపథ్య సంగీతం పండుగ వాతావరణాన్నితీసుకొచ్చింది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్యాలిటీలో వున్నాయి. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్షన్, పృథ్వి స్టంట్స్ ట్రైలర్ ఇంపాక్ట్ ని మరింత పెంచింది.
దర్శకుడు త్రినాధ రావు నక్కినతో కలిసి పని చేసే ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలను రూపొందించడంలో తన నైపుణ్యాన్ని చూపించారు. హిట్ ప్రాజెక్టులను క్రియేట్ చేయడంలో మంచి ట్రాక్ రికార్డ్ వున్న ఈ జంట తమ సిగ్నేచర్ స్టయిల్ లో హ్యుమర్ అండ్ డ్రామాని బ్లెండ్ చేస్తూ మరో మరపురాని ఎంటర్టైనర్ను హామీ ఇస్తున్నారు.
ఫిబ్రవరి 26న మహా శివరాత్రికి విడుదల కానున్న ఈ సినిమాపై ట్రైలర్ భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ మాస్ ఎంటర్టైనర్ను ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మించగా.. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























