చై వలనే ఆర్ఆర్ అద్భుతంగా వచ్చింది

Rock Star Devi Sri Prasad Praises Naga Chaitanya's Transformation in Thandel

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో ఫస్ట్ షో నుంచే ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ‘తండేల్’ హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీం సక్సెస్ సెలబ్రేషన్స్ ని నిర్వహించింది.

ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. “అందరికీ థాంక్ యూ. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చై అద్భుతంగా పెర్ఫామ్ చేశారు, ఆయన నటన వలనే ఆర్ఆర్ అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా కథ విన్నప్పుడే మ్యాజికల్ గా అనిపించింది. చందు గారు అంతే అద్భుతంగా తీశారు” అని ప్రశంసించారు.

ఇంకా ఆయన హీరో, హీరోయిన్ గురించి మాట్లాడుతూ.. “చై ట్రాన్స్ ఫర్మేషన్ మ్యాజికల్‌గా వుంది. సాయి పల్లవి గారు అద్భుతంగా నటించారు. ఈ సినిమాకి మ్యూజిక్ చేయడం చాలా ఆనందంగా వుంది. మా పెద్ద ‘తండేల్’ అరవింద్ అంకుల్. వాసు మై డియర్ ఫ్రెండ్. ఇదంతా టీం వర్క్. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ సో మచ్” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.