యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 31వ సినిమాను ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడని తెలిసిందే.రీసెంట్ గా లాంచ్ కూడా జరిగిపోయింది.ఇక ఈసినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఈనెల మూడో వారంలో షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. త్వరలోనే టైటిల్ కూడా చెప్పనున్నారు.ఈ క్రేజీ కాంబినేషన్ ఫై భారీ అంచనాలు వున్నాయి.షూటింగ్ ఆలస్యం కాకుంటే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలకానుంది.ఈసినిమా కోసం హీరోయిన్ గా కెజిఎఫ్ ఫేమ్ రుక్మిణి వసంత్ ను తీసుకోవాలనుకుంటున్నారట.రవి బసృర్ సంగీతం అందించనుండగా మైత్రి మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో వార్ 2 చేస్తున్నాడు.క్లైమ్యాక్స్ షూట్ జరుగుతుంది.అయాన్ ముఖర్జీ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు.యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.ఈ ఏడాది ఆగస్టు లో రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పటివరకు అయితే అధికారికంగా ఈసినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు.
ఇక గత ఏడాది దేవర తో వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు ఎన్టీఆర్.ఈసినిమా 400కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది.కొరటాల శివ డైరెక్ట్ చేయగా అనిరుధ్ సంగీతం అందించాడు.ఎన్టీఆర్ అర్స్ ,యువసుధ ఆర్ట్స్ నిర్మించాయి.ఈసినిమాకు సీక్వెల్ కూడా రావాల్సివుంది.ఎన్టీఆర్ నీల్ సినిమా తరువాత దేవర 2 స్టార్ట్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























