లైలా థర్డ్ సింగిల్ ‘ఓహో రత్తమ్మ’ రిలీజ్

Laila Third Single Oho Rathamma Out

టాలీవుడ్ ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలకానుంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌గా రెండు పాటలు అలాగే టీజర్ రిలీజ్ అవ్వగా వీటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా త్వరలోనే ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో నేడు ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ విడుదలయింది. ‘ఓహో రత్తమ్మ’ అంటూ సాగే ఈ సాంగ్‌ను ప్రముఖ జానపద కళాకారుడు పెంచల్ దాస్ స్వయంగా రచించి ఆలపించారు. మరో పాపులర్ సింగర్ మధుప్రియ ఆయనతో కలిసి ఆలపించారు. లియోన్ జేమ్స్ అందించిన సంగీతం మంచి రిథమ్‌తో యువతను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరించినట్టుగా అర్ధమవుతోంది.

ఇక ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపించనుండటం విశేషం. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కి టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ థర్డ్ సింగిల్ వాటిని మరింత హై కి తీసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక విశ్వక్ లాస్ట్ రెండు సినిమాలు అనుకున్నంతగా రిజల్ట్ ఇవ్వలేకపోయాయి. దాంతో షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ మూవీతో ఎలాగైనా గట్టిగ కొట్టాలని భావిస్తున్నాడు.

ఇదిలావుంటే విశ్వక్ దీని తరువాత ‘ఫంకీ’ అనే చిత్రంలో నటించనునున్నాడు. ‘జాతి రత్నాలు’ ఫేమ్ కెవి అనుదీప్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ఫ్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాను నిర్మించనున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.