మాస్ మహారాజా రవితేజ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా మాస్ జాతర.మనదే ఇందంతా అనేది ట్యాగ్ లైన్.రవితేజ కు ఇది 75వ సినిమా.ఈ ల్యాండ్ మార్క్ మూవీ ని అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఇందులో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని టాక్.ఇక ఈసినిమా నుండి పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రవితేజ బర్త్ డే జనవరి 26న ఈ గ్లింప్స్ రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు.ఈసందర్భంగా విడుదలచేసిన మాస్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.మే 9న మాస్ జాతర థియేటర్లలోకి రానుంది.
ఇక ఈసినిమాపై రవితేజ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.రవితేజ చివరి నాలుగు సినిమాలు నిరాశ పరచడంతో మాస్ జాతర తో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మరి ఈసినిమాతోనైనా రవితేజ కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.ఇదిలావుంటే ఒక సినిమా పూర్తి కాకముందే మరో సినిమాకు కమిట్ అయ్యే రవితేజ ఈ సారి మాత్రం ఇంతవరకు మరో సినిమాను ప్రకటించలేదు.మాస్ జాతర రిలీజ్ తరువాతే రవితేజ నెక్స్ట్ మూవీ అప్డేట్ రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























