టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘కృష్ణ వింద విహారి, ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ సినిమాలు యావరేజ్‌గా నిలిచాయి. దీని తర్వాత ఎన్నో అసలు పెట్టుకున్న ‘రంగబలి’ బావుందని టాక్ తెచ్చుకుంది కానీ, సాలిడ్ వసూళ్లు సాధించలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యాడు శౌర్య.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఫ్రెష్ కంటెంట్‌తో తన లక్ పరీక్షించుకోవడానికి సిద్దమయ్యాడు. దీనిలో భాగంగా తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న కొత్త సినిమా టైటిల్ ప్రకటన వచ్చింది. అలాగే ఈరోజు నాగశౌర్య జన్మదినం సందర్భంగా ఈ మూవీ నుంచి తన ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై డా. అశోక్ కుమార్ చింతలపూడి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అనే టైటిల్ ఖరారు చేశారు.
టైటిల్ నాగ శౌర్య క్యారెక్టర్ ఇంటెన్స్ నేచర్‌ని సూచిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో వ్యాన్ వెనుక కూర్చుని ఇంటెన్స్ లుక్‌తో ఫెరోషియస్ అవతార్‌లో కనిపించారు. అతని నుదిటిపై రక్తంతో కూడిన మూడు గోవింద నామాలు, చేతులపై రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. వ్యాన్‌పై వున్న స్టిక్కర్ Hyderabad లో BAD అనే పదాన్ని తొలగించడం అతని పాత్ర తాలూకూ దూకుడు స్వభావాన్ని, యాక్షన్-ప్యాక్డ్ స్టయిల్ని సూచిస్తుంది.
షూటింగ్ కంప్లీట్ కావస్తున్న ఈ చిత్రం ఇంట్రస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఈ విధంగా ప్రమోషన్స్‌ని ప్రారంభించినట్టయింది. ఇక ఈ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రంలో హీరోనాగశౌర్యకు జోడిగా విధి హీరోయిన్గా నటిస్తోంది. అలాగే సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వీ, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, శివన్నారాయణ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు.
టైటిల్ అయితే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. కాగా ఈ చిత్రానికి పేరొందిన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్టార్ కంపోజర్ హ్యారిస్ జయరాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వెల్లడించనున్నారు మేకర్స్.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























