టాలీవుడ్లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నాడు. ఈ టాలెంటెడ్ నటుడు ఇటీవలే ‘క’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో కెరీర్లో తొలిసారి 50 కోట్ల మార్క్ అందుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మరో లేటెస్ట్ మూవీ ‘దిల్ రుబా’. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన్న ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటించగా.. మరో నటి నజియా డేవిసన్ కీలక పాత్రలో కనిపించనుంది. విశ్వ కరుణ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలావుంటే, తాజాగా ఈ యంగ్ హీరో తన అభిమానులకు ఒక శుభవార్త చెప్పారు. కాగా కిరణ్ ఇటీవలే సహనటి రహస్య గోరక్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే త్వరలోనే వారు తల్లిదండ్రులు కాబోతున్నారు. కిరణ్ సతీమణి రహస్య ప్రస్తుతం 2 నెలల గర్భవతి. ఈ మేరకు విషయాన్ని స్వయంగా కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా భార్యతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఇది చూసిన ఆయన అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























