విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కొనసాగిస్తోంది. మొదటి రోజుకు దీటుగా మూడో రోజు కూడా వసూళ్లను రాబట్టుకుని సునాయాసంగా 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 106కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఇందులో షేర్ 50కోట్లు దాటింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇలా విడుదలైన అన్ని చోట్లా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఈ సినిమా.. నైజాం, సీడెడ్, గుంటూరు ఏరియాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నేపథ్యంలో అన్ని ఏరియాల్లో సంక్రాంతికి వస్తున్నాం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఇకపై ఫుల్ రన్ లో నిర్మాతలకు భారీ లాభాలను తీసుకురానుంది.
కాగా ఇప్పటివరకు బుక్ మై షోలో 1.5 మిలియన్లకు పైగా టికెట్ సేల్స్ జరిగాయి. నిన్న కూడా బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్లో వున్నాయి. ఈరోజు, రేపు వీకెండ్ కావడంతో ఈ రెండు రోజులు అదిరిపోయే వసూళ్లు సాధించనుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే నెల వరకు సినిమాలు ఏవి లేకపోవడంతో సూపర్ లాంగ్ రన్ ను కొనసాగించనుంది.
ఇక ఫుల్ రన్ లో ఈ సినిమా 300కోట్ల మార్క్ ను టచ్ చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదు. విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్ లో సంక్రాంతికి వస్తున్నాం హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించనుంది. మొత్తానికి వెంకీ, అనిల్ రావిపూడి కాంబో బిగ్ హ్యాట్రిక్ అందుకున్నట్టయింది.
కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ప్రతిష్టత్మకంగా ఈ సినిమాను నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























