భారీ అంచనాల మధ్య గత ఏడాది చివర్లో వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ఇండియన్ ఇండస్ట్రీ హిట్ రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించింది. ఈసినిమా 1800 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బాహుబలి 2 ని క్రాస్ చేసింది.ఇప్పటికీ నార్త్ లో డీసెంట్ రన్ ను కొనసాగిస్తోంది.ఇప్పటికే హిందీలో 800కోట్లకుపైగా వసూళ్లతో ఆల్ టైం గ్రాసర్ గా రికార్డు నెలకొల్పింది.ఇక ప్రేక్షకులను మరోసారి థియేటర్లలోకి రప్పించడానికి మేకర్స్ మరో 20 నిమిషాల సీన్లను యాడ్ చేసి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ పేరుతో రిలీజ్ చేయనున్నారు.రేపటి నుండి ఈ వెర్షన్ థియేటర్లలోకి రానుంది.ఈ సందర్భంగా నైజాంలో మేకర్స్ టికెట్ ధరలను కూడా తగ్గించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సింగిల్ స్క్రీన్ 112 అలాగే మల్టీఫ్లెక్స్ లో 150 రూపాయలుగా నిర్ణయించారు.అయితే హిందీ లో మరోసారి సూపర్ రన్ ను కొనసాగించే ఛాన్స్ ఎక్కువగా వుంది.ప్రస్తుతం అక్కడ వేరే సినిమాలతో పోటీ కూడా లేదు అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ కాగా అన్ని సూపర్ గా ఆడుతున్నాయి.మరి ఇంత పోటీని తట్టుకొని పుష్ప 2 రీ రీలోడెడ్ వెర్షన్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
సుకుమార్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటించాడు. ఇందులో రష్మిక హీరోయిన్ కాగా రావు రమేష్ ,జగపతి బాబు ,అజయ్ ,కేశవ కీలక పాత్రల్లో నటించారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























