టాలీవుడ్ యంగ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తుండగా.. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదల లీడ్ యాక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ముగ్గురూ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనుండగా.. వారి సరసన అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌ని కిక్ స్టార్ట్ చేశారు మేకర్స్.
దీనిలో భాగంగా నేడు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా భైరవం నుండి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ‘ఓ వెన్నెల’ అంటూ సాగే ఈ పాటను శ్రీచరణ్ పాకాల మంచి జోష్ తో కూడిన బ్యూటిఫుల్ మెలోడీగా కంపోజ్ చేశారు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రగ్గడ్ అండ్ మ్యాసీ అవతార్‌లో కనిపించాడు.
వెన్నెల పాత్రలో అదితి శంకర్ పల్లెటూరి అమ్మాయిగా ఆకర్షణీయంగా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ఇక అనురాగ్ కులకర్ణి మరియు యామిని ఘంటసాల ఎనర్జిటిక్ వాయిస్‌తో పాటకు ప్రాణం పోశారు. తిరుపతి జావన రాసిన సాహిత్యం బెల్లంకొండ పాత్రలోని భావోద్వేగాలను అందంగా వ్యక్తీకరించింది. వెన్నెల పట్ల తనకున్న ప్రేమను, అలాగే వారిద్దరి మధ్య ఉన్న పరస్పర భావాలను హృద్యంగా చూపింది.
నియో-నోయిర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో ప్రముఖ తారాగణం సందడి చేస్తుండగా.. పేరొందిన సాంకేతిక సిబ్బంది పనిచేస్తున్నారు. హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ, శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తుండగా.. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























