గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గేమ్ చేంజర్ విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ అంచనాలను మరింత పెంచేలా తాజాగా ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల కావటం విశేషం.
ఈ సందర్భంగా ఈ సినిమాకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ మాట్లాడుతూ.. “మూడేళ్లుగా ఈ సినిమాను దిల్ రాజు గారు చాలా జాగ్రత్తగా దాచారు. దిల్ రాజు గారికి ఈ చిత్రంతో పెద్ద హిట్ రావాలి. జనవరి 10న ఆయనకు నేను ప్రేమగా ఓ హగ్ ఇవ్వాలి. ‘బాయ్స్’ నుంచి ‘గేమ్ ఛేంజర్’ వరకు నా ప్రయాణాన్ని శంకర్ గారు చూశారు. ఆయన మొదటి సారిగా ఓ తెలుగు సినిమాను, అది కూడా రామ్ చరణ్ గారితో చేశారు. శంకర్ గారితో నా బంధాన్ని చాటేలా ఈ మ్యూజిక్ ఉంటుంది. మా ట్రైలర్‌ను లాంచ్ చేసిన రాజమౌళి గారికి థాంక్స్. సంక్రాంతికి పర్‌ఫెక్ట్ సినిమాగా గేమ్ ఛేంజర్ జనవరి 10న రాబోతోంది” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























