రాజమౌళి, శంకర్.. ఇద్దరూ ఇద్దరే – రామ్ చరణ్

Global Star Ram Charan Praises Directors Shankar and SS Rajamouli

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజ‌ర్‌’. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ భారీ బ‌డ్జెట్ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో గేమ్ చేంజ‌ర్ విడుద‌ల‌వుతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన సాంగ్స్‌, టీజ‌ర్‌, ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో సినిమాపై అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచేలా తాజాగా ‘గేమ్ ఛేంజ‌ర్‌’ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి చేతుల మీదుగా ఈ ట్రైల‌ర్ విడుద‌ల కావ‌టం విశేషం.

ఈ సందర్భంగా గ్లోబ‌ల్‌స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రాజమౌళి గారికి థాంక్స్. రాజమౌళి గారు, శంకర్ గారు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వరు. వారు అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చే వరకు షూట్ చేస్తుంటారు. ఇద్దరూ చాలా పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తుంటారు” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “శ్రీకాంత్ గారు, ఎస్ జే సూర్య గారు, సముద్రఖని గారు, అంజలి గారు, కియారా ఇలా ఆర్టిస్టులంతా అద్భుతంగా నటించడంతోనే సినిమాకు ఇంతటి అందం వచ్చింది. అందరి పర్ఫామెన్స్‌లతోనే ఈ సినిమా ఎలివేట్ అవుతోంది. సాయి మాధవ్ బుర్రా గారు మంచి డైలాగ్స్ ఇచ్చారు. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. దిల్ రాజు గారు, శిరీష్ గారు ఈ సినిమాను అద్భుతంగా నిర్మించారు. జనవరి 10న గేమ్ చేంజర్ రాబోతోంది” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.